Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలి

బీజేపీ మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ

 కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 2: పేద, మధ్యతరగతి ప్రజల పై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షు రాలు చొప్పరి జయశ్రీ డిమాండ్‌ చేశారు.కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో పెట్రోల్‌ ఉత్పత్తులపై వ్యాట్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా ఇన్‌చార్జి ఉమామహేశ్వర్‌రెడ్డి, పార్టీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశశిల్పా వేదం, ఉమారాణి, చైతన్య,  రమాదేవి, చంద్రకళ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement