పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2021-12-01T04:36:44+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌పై పెంచిన ఆధారిత పన్ను(వ్యాట్‌) ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి
ఎడ్లబండ్లతో నిరసన తెలుపుతున్న బీజేపీ జిల్లా నాయకులు

- ఎద్దులబండ్లతో బీజేపీ నిరసన ర్యాలీ 


మహబూబ్‌నగర్‌(క్లాక్‌టవర్‌), నవంబరు 30 : పెట్రోల్‌, డీజిల్‌పై పెంచిన ఆధారిత పన్ను(వ్యాట్‌) ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు నాయకులు ఎద్దులబండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వ ఆధారిత పన్నును(వ్యాట్‌) సామాన్య ప్రజలకు దీపావళి కానుకగా ఇచ్చి ధరలు తగ్గిం చిన విషయం తెలిసిందేనని అన్నారు. దేశంలో బీజేపీ, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా వ్యాట్‌ ను తగ్గించి సామాన్య ప్రజానీకాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నా యకులు పద్మజారెడ్డి, పడాకుల బాల్‌రాజు, వీరబ్ర హ్మచారి, కృష్ణవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య, పోతుల రాజేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కృష్ణ, పద్మవేణి, రాజుగౌడ్‌, గంగన్న తదితరులున్నారు. 


 సీఎం కేసీఆర్‌ది కపట ప్రేమ

మూసాపేట : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌ పై వెంటనే వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ మండల నాయకులు మంగళవారం మండల కేంద్రంలో నిర సన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ట్లు పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌గౌడ్‌ తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై కపట ప్రేమ తప్ప అసలు ప్రేమ లేదని ఆరోపించారు. కార్యక్ర మంలో బీజేపీ నాయకులు సుకుమార్‌, హరీష్‌కు మార్‌, పెద్ద ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T04:36:44+05:30 IST