Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 2: పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం  వ్యాట్‌ను తగ్గించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ చౌరస్తాలో పెట్రోల్‌ బంక్‌ ఎదుట గురువారం బీజేపీ మహిళా మోర్చా జిల్లా కమిటీ అధ్వర్యంలో మహిళలు, నాయకులు మూతికి నల్లగుడ్డ కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు.   నల్ల జెండాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం  పెట్రోల్‌, డీజిల్‌ ధరలను  తగ్గించదన్నారు. అదే మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో విధించే వ్యాట్‌ను తగ్గిస్తే వాహనదారులకు మరింత భారం తగ్గుతుందన్నారు.  కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి సంతోషి, జిల్లా ఉపాధ్యక్షురాలు రేగుల రేణుక, తంగళ్లపల్లి మండల అఽధ్యక్షురాలు కోడం భవిత, వేములవాడ రూరల్‌ మండల అధ్యక్షురాలు ఎలిగేటి జ్యోతి, బోయినపల్లి మండల అధ్యక్షురాలు సంగీత, సువర్ణ,  బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బర్కం నవీన్‌కుమార్‌యాదవ్‌, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, బీజేవైఎం జిల్లా  ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్‌, పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement