11 మంది టీచర్లకు వాత

ABN , First Publish Date - 2021-11-26T06:46:51+05:30 IST

అడ్డగోలుగా బదిలీల్లో ఆప్షన్లు ఇచ్చిన ఉపాధ్యాయులకు డీఈఓ శా మ్యూల్‌ భారీగా వాత పెట్టారు.

11 మంది టీచర్లకు వాత

 ఒక ఇంక్రిమెంట్‌ కట్‌... 

రెండేళ్లు ఉద్యోగోన్నతులు ఉండవు

సుమారు రూ. 10 లక్షల వరకూ నష్టం

మరో ఇద్దరిపై త్వరలో వేటు

బదిలీల్లో అడ్డగోలు ఆప్షన్లకు ఫలితం 

అనంతపురం విద్య, నవంబరు 25 : అడ్డగోలుగా బదిలీల్లో ఆప్షన్లు ఇచ్చిన ఉపాధ్యాయులకు డీఈఓ శా మ్యూల్‌ భారీగా వాత పెట్టారు. వారి జీతాల్లో పెద్దఎత్తున కోత పడేలా శిక్ష విధించారు. సర్వీసులో కూడా ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ చే స్తూ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 11 మంది టీచ ర్లపై చర్యలు తీసుకుంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. 2020 ఏడాది చివర్లో నిర్వహించిన బదిలీల్లో జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో టీచర్లు అడ్డగోలుగా ప్లేస్‌లకు ఆప్షన్లు ఇచ్చి లబ్ధి పొందాలని చూ శారు. ఈ అక్రమాలపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై డీఈఓ విచారణ చేయించారు. ఫలితంగా రెండు విడతలుగా 13 మంది టీచర్లను సస్పెండ్‌ చేశారు. తర్వాత వారికి పెండింగ్‌ ఎంక్వైరీ కింద పోస్టింగ్‌ ఇచ్చారు. ఇటీవలే వారిపై డీఈఓ విచారణ చేయించారు. వారి నుంచి రాత పూర్వకంగా సం జాయిషీ కూడా రాయించుకున్నారు. తర్వాత మీకు ఒక ఇంక్రిమెంట్‌ ఎందుకు కట్‌ చేయకూడదో చెప్పాలంటూ  13 మందికి నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన వివర ణకు, చేసిన తప్పులకు సంబంధం లేకపోవడంతోపాటు, అక్రమాలు చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. 13 మందిలో ఏకంగా 11 మంది టీచర్లపై చర్యలు తీసుకున్నారు. సర్వీసులో ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ చేయటంతో పాటు రెండేళ్లపాటు ఎలాంటి ఉద్యోగోన్నతులు పొందడానికి వారికి అవకాశం లేకుండా చేశారు. ఈ మేరకు ఇటీవలే డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఇద్దరు టీచర్లపై కూడా విచారణ చేస్తున్నారు. వారిపై కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇప్పుడు 11 మంది టీచర్లకు ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ (విత్‌క్యూ ములేటివ్‌) చేయడం వల్ల  ఆ టీచర్లు ఒక్కొక్కరు సుమా రు రూ. 10 లక్షల వరకూ కోల్పోయే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా అడ్డగోలు గా ఆప్షన్లు ఇచ్చిన ఆ టీచర్లపై డీఈఓ తీసుకున్న చర్యతో భవిష్యత్తులో ఇతరులు అక్రమాలు చేయడానికి వెనకంజ వేస్తారన్న అభిప్రాయం విద్యాశాఖ, ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్త మవుతోంది.  

Updated Date - 2021-11-26T06:46:51+05:30 IST