Abn logo
Sep 19 2021 @ 00:27AM

వేదాద్రి గోశాలకు రూ.1.22 లక్షల వితరణ

గో శాల నిర్వాహకులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే గిరిధర్‌ తదితరులు

గుంటూరు, సెప్టెంబరు 18: కృష్ణా జిల్లా వేదాద్రి గోశాల నిర్వహణకు వాసవీక్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, గీతామందిరం చైర్మన్‌ రాయవరపు అశోక్‌కుమార్‌తో పాటు మిత్రుల సహకారంతో రూ.లక్షా 22 వేలు చెక్కును గోశాల నిర్వాహకులకు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ ద్వారా   అందజేశారు. ఏటుకూరు రోడ్డులోని గీతామందిరంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో గో సంరక్షణకు వేదాద్రి గోశాల నిర్వాహకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈక్రమంలో రాయవరపు అశోక్‌, వారి మిత్ర బృందం గోశాలకు సహాయం చేసేందుకు ముందుకు రావటం స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో గుడిపాటి వెంకటభాస్కర్‌, చెన్నకేశవ బాబ్జీ, పొట్టి రంగారావు, మహేష్‌, సుధాకర్‌, అమర్‌నాథ్‌, నూనె శ్రీనివాసరావు, సంకా శ్రీనివాసరావు, హరిప్రసాద్‌, కామేశ్వరరావు, రాయవరపు శ్రీకాంత తదితరులు పాల్గొన్నారు.