‘వేదాంత’ ఆఫర్... షార్ప్ రియాక్షన్...

ABN , First Publish Date - 2021-11-24T05:30:00+05:30 IST

వేదాంత ప్రమోటర్ల ప్రమోటర్ల నుంచి వచ్చిన ఓపెన్‌ ఆఫర్‌ నేపధ్యంలో... స్టాక్‌లో షార్ప్‌ రియాక్షన్‌ కనిపించింది.

‘వేదాంత’ ఆఫర్... షార్ప్ రియాక్షన్...

ముంబై : వేదాంత ప్రమోటర్ల ప్రమోటర్ల నుంచి వచ్చిన ఓపెన్‌ ఆఫర్‌ నేపధ్యంలో... స్టాక్‌లో షార్ప్‌ రియాక్షన్‌ కనిపించింది. ఒక్కో షేరును రూ.  350 ధరతో, 4.57 శాతం వాటాను(సుమారు 170 మిలియన్ షేర్లు) కొంటామని ప్రమోటర్‌ కంపెనీలైన ట్విన్‌స్టార్, వేదాంత ఎన్‌ఎల్ ప్రకటించిన తర్వాత, స్టాక్‌ 7.7 శాతం జంప్‌ చేసింది. ప్రమోటర్ల మొత్తం కమిట్‌మెంట్‌ వాల్యూ దాదాపు రూ. 6 వేల కోట్లు. ఇందులో భాగంగా, మొన్న(మంగళవారం) జరిగిన రెండు భారీ డీల్స్‌ ద్వారా, ఒక్కో షేరు రూ. 350 వద్ద, రూ. 4,820 కోట్లతో 3.71 శాతం వాటాను(137 మిలియన్లకు పైగా షేర్లు) ట్విన్‌స్టార్, వేదాంత ఎన్‌ఎల్ కొనుగోలు చేశాయి. వేదాంత సంస్థ ఆయిల్‌, గ్యాస్‌తోపాటు, ఐరన్‌, కాపర్‌, జింగ్‌, అల్యూమినియం వ్యాపారాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇవి త్వరలోనే మూడు వేరువేరు లిస్టెడ్ కంపెనీలుగా మారనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


ఇక... కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ విషయంలో కొన్ని ఆందోళనలున్నాయి. పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రీసోర్సెస్‌కు 8.5 బిలియన్ డాలర్ల మేర రుణభారం ఉంది, దీనిపై ఏటా ఏడు మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లించాలి. ఇక... 2022-23 లో... ఇందులో మూడు బిలియన్ డాలర్లకు పైగా తప్పనిసరిగా చెల్లించాలి. ఇక... 2020-21 లో... వేదాంత లిమిటెడ్... తన పేరెంట్‌ కంపెనీకి 956 మిలియన్ డాలర్ల  రుణాన్ని తెచ్చి ఇచ్చింది, మళ్లీ అలాంటి భారీ రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇది కాకుండా... ట్యుటికోరిన్‌లోని కాపర్ స్మెల్టర్‌కు సంబంధించి చట్టపరమైన సమస్యలున్నాయి. ఈ క్రమంలోనే... కాపర్‌ డివిజన్‌లో నష్టాలు సంభవించాయి. 


దీనికిమించి, మెటల్స్‌, ఫ్యూయల్స్‌లో కమోడిటీ సైకిల్స్‌ అత్యంత కీలకం. కమోడిటి సైకిల్ ట్రెండ్ అప్‌లో కొనసాగినపక్షంలో... బలమైన లాభదాయకతను ఆశించవచ్చు. అయితే... మెటల్స్‌, ఫ్యూయల్‌ సైకిల్స్‌ రెండూ కూడా గరిష్ట స్థాయికి దగ్గరగా ఉన్నాయన్న సంకేతాలున్నాయి, కరెక్షన్‌ కూడా కనిపిస్తోంది. యూరోప్‌లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపధ్యంలో... అక్కడ వృద్ధి రేట్ల అంచనాలు తగ్గుతున్నాయి. చైనా రియల్ ఎస్టేట్‌ కూడా కలవరపరుస్తున్నట్లు వినవస్తోంది. 


మెటల్స్‌, ఫ్యూయల్స్‌ గత నెలలో కొన్ని కరెక్షన్స్‌ చూశాయి. నాలుగో త్రైమాసికం నాటికి అంచనా వేసిన డిమాండ్‌తో పోలిస్తే, ముడిచమురు, గ్యాస్ ఓవర్‌ సప్లైలో ఉంటాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనా. కాగా... వేదాం ఎక్స్‌పోజర్‌ ఉన్న రంగాలన్నీ గత పన్నెండు నెలల్లో భారీగా లాభపడ్డాయి, అక్టోబరు ప్రారంభంలో గరిష్ట స్థాయులకు చేరాయి. ఈ టెంపరరీ బుల్‌ ట్రెండ్‌కు విరుద్ధంగా ఇది లాంగ్‌టర్మ్‌లో రివర్స్‌ అయితే, వేదాంతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

Updated Date - 2021-11-24T05:30:00+05:30 IST