Abn logo
Sep 19 2021 @ 07:35AM

వేదారణ్యం జాలర్లపై శ్రీలంక జాలర్ల దాడి

చెన్నై: నాగపట్టినం జిల్లా కోడియక్కరై సమీపంలో సముద్రంలో చేపలవేట సాగిస్తున్న వేదారణ్యం జాలర్లపై శ్రీలంక జాలర్లు సామూహికంగా దాడి జరిపారు. కోడియక్కరై సమీపం ఆరు కాట్టుతురైకి తూర్పుదిశగా సుమారు 15 నాటికల్‌ మైళ్ళ దూరంలో వేదారణ్యం కు చెందిన జాలర్లు శనివారం వేకువజాము చేపలవేట సాగిస్తుండగా ఐదు పడవలలో చుట్టుముట్టిన 25 మంది శ్రీలంక జాలర్లు దాడికి దిగారు. వేటకొడవళ్ల దాడి జరిపి 500 కేజీల బరువున్న వలలు, జీపీఎస్‌ పరికరాలను దోచుకున్నారు. ఈ సంఘటనతో భీతిల్లిన వేదారణ్యం జాలర్లు శనివారం ఉదయం తీరానికి చేరుకున్నారు. ఆ జాలర్లు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

క్రైమ్ మరిన్ని...