వలస కార్మికులకు అండగా వీర్ ఫౌండేషన్

ABN , First Publish Date - 2020-05-26T00:20:26+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న వలస కార్మికులు వీర్ ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో...

వలస కార్మికులకు అండగా వీర్ ఫౌండేషన్

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న వలస కార్మికులు వీర్ ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శానిటైజేషన్ కార్యక్రమాలను చేప్టడంతో పాటు భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. వలస కార్మికులకు మాత్రమే కాకుండా వయోవృద్ధులు, దివ్యాంగులకు కూడా ఆసరాగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ట్రస్టీ నితిన్ సంఘవి మాట్లాడుతూ, ఏప్రిల్ 4వ తేదీ నుంచి సహాయ కార్యక్రమాలను ప్రారంభించామని, ఇప్పటివరకు 16వేల హౌసింగ్ సొసైటీలు, ఆసుపత్రులు, ఆఫీసుల్లో శానిటైజేషన్ కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా ప్రజా రవాణా వాహనాలను కూడా ఉచితంగా శానిటైజ్ చేశామని చెప్పారు. 


‘దేశ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి అడ్డుకోవడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాం. మా సహచర ట్రస్టీలు, వలంటీర్లు రెండు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తూ శానిటైజేషన్ కార్యక్రమాలను నిర్వహించారు. అన్నర్తులకు భోజన ఏర్పాట్లనూ చేశాం. వలసకార్మికులు, వయోవృద్ధులు, దివ్యాంగుల రక్షణే ధ్యేయంగా చేయూత అందించాం. ఇవే తరహా కార్యక్రమాలను మరింతగా విస్తరించనున్నాం'' అని తెలిపారు.

Updated Date - 2020-05-26T00:20:26+05:30 IST