Modi పైనే ఆధారపడితే కుదరదు : విపక్షాలకు మొయిలీ సూచన

ABN , First Publish Date - 2021-07-30T02:22:03+05:30 IST

‘మోదీ వ్యతిరేకత’ అన్న ఒకే ఒక అంశంతో ప్రతిపక్ష కూటమి సఫలీకృతం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు

Modi పైనే ఆధారపడితే కుదరదు : విపక్షాలకు మొయిలీ సూచన

బెంగళూరు : ‘మోదీ వ్యతిరేకత’ అన్న ఒకే ఒక అంశంతో ప్రతిపక్ష కూటమి సఫలీకృతం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. విపక్షాలన్నీ ‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’ అన్న అజెండాతో ముందుకు సాగితేనే లాభముంటుందని స్పష్టం చేశారు. ‘‘నాయకత్వం గురించి బెంగ పెట్టుకుంటే కూటమి ముందుకు సాగదు. ఎవరు నాయకత్వం వహిస్తారన్న అంశంలో భేదాభిప్రాయాలు వస్తే జట్టు కట్టడంలో విఫలమవుతాం’’ అని వీరప్ప మొయిలీ తీవ్రంగా హెచ్చరించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ కావడం ఆహ్వానించదగ్గ పరిణామమని మొయిలీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-30T02:22:03+05:30 IST