Abn logo
May 12 2021 @ 00:20AM

నేటి నుంచి ఆరు కూరగాయల మార్కెట్లు

బనగానపల్లె, మే 11: కరోనా నేపథ్యంలో పట్టణంలో 6 చోట్ల కూరగాయల మార్కెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ఈవో ఖలీల్‌బాషా మంగళవారం తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకూ  పట్టణంలో పెరుగుతుండడంతో  ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ఈవో ఖలీల్‌ బాసా మంగళవారం తెలిపారు. బనగానపల్లె పట్టణంలోని ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నతపాఠశాల, వెటర్నరీ కార్యాల యం,  బ్రిడ్జి సమీపంలోని ప్రాథమిక పాఠశాల,  పెద్దపీర్లచావిడి, కస్బా పాఠశాల వద్ద కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  

Advertisement