వంకాయ ‘వర్రీ’

ABN , First Publish Date - 2021-11-30T06:47:05+05:30 IST

మునుపెన్నడూ లేని ధరలు ఈసారి చూస్తున్నామని...

వంకాయ ‘వర్రీ’

  • మడికి మార్కెట్లో భగ్గుమన్న రేటు
  • 10 కిలోలు హోల్‌సేల్‌ ధర రూ.వెయ్యి 
  • రిటైల్‌గా కిలో రూ.150

ఆలమూరు, నవంబరు 29: కార్తీకమాసంలో కూరగాయల ధరలు అధికంగా ఉండటం సహజమే. కానీ మునుపెన్నడూ లేని ధరలు ఈసారి చూస్తున్నామని వినియోగదారులు వాపోతున్నారు. కూరగాయల్లో రారాజుగా పిలవబడే వంకాయల ధర ఆకాశంపైకి దూసుకెళ్లింది. ఆలమూరు మండలం మడికి అంత ర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో వంకాయల ధర రికార్డు స్థాయికి చేరుకుంది. సోమవారం ఇక్కడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో పది కిలోల వంకాయలు రూ.1000 పలికింది. ఇదే వంకాయలు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.150పైమాటే. కార్తీకంలో సాధారణంగా గతంలో పది కిలోల వంకాయలు రూ.600 వరకు ధర పలకడం జరిగేది. ఇటీవల ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వంగ తోటలు దెబ్బతినడంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దీంతో ధరలు భారీగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2021-11-30T06:47:05+05:30 IST