పొరుగు రాష్ర్టాల నుంచి భారీగా కూరగాయల దిగుమతి

ABN , First Publish Date - 2020-02-20T22:11:27+05:30 IST

పొరుగురాష్ర్టాల నుంచి తెలంగాణకు భారీగా కూరగాయల దిగుమతి పెరిగింది. గత కొన్నినెలల క్రితం తెలంగాణలో కూరగాయల ధరలు పెరిగిపోవడంతో తప్పని సరి పరిస్థితిలో కొన్నిరాష్ర్టాల నుంచి కొంత టమాటా, ఆలూ, క్యాప్సికం వంటివి వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు

పొరుగు రాష్ర్టాల నుంచి భారీగా కూరగాయల దిగుమతి

హైదరాబాద్‌: పొరుగురాష్ర్టాల నుంచి తెలంగాణకు భారీగా కూరగాయల దిగుమతి పెరిగింది. గత కొన్నినెలల క్రితం తెలంగాణలో కూరగాయల ధరలు పెరిగిపోవడంతో తప్పని సరి పరిస్థితిలో కొన్నిరాష్ర్టాల నుంచి కొంత టమాటా, ఆలూ, క్యాప్సికం వంటివి వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని పెద్దమొత్తంలో కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వంటివి దిగుమతి అవుతున్నాయి. అలాగేకర్నాటక నుంచికూడా క్యాప్సికం, పచ్చిమిర్చి, టమాటా వంటివి దిగుమతి జరుగుతోంది. కానీ ప్రస్తుతం రాజస్తాన్‌ నుంచి కూడా హైదరాబాద్‌నగరానికి టమాటా, బిన్నీసు, పర్చిమిర్చి వంటివి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్‌, మహా రాష్ట్ర,  కర్నాటక, రాజస్దాన్‌ నుంచి భారీగా కూరగాయల దిగుమతి జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈఏడాది భారీగానే వర్షాలుకురిసిన నేపధ్యంలో తెలంగాణలోని పలుజిల్లాల నుంచి భారీగా కూరగాయలు దిగుమతి అవుతున్నారు. ఇక పక్క రాష్ర్టాల నుంచి కూడా దిగుమతులు పెరగడంతో ప్రస్తుతం కూరగాయల ధరలు నిలకడగానే ఉన్నాయి. ప్రత్యేకించి టమాటా విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో భారీగా ఉత్పత్తిఅవుతున్నా ఇప్పుడు ఏపీ, కర్నాటక, రాజస్ధాన్‌ నుంచి కూడా తెలంగాణకు దిగుమతి అవుతోంది. దీంతో ధరలు బాగా పడిపోయాయి. 


ఆరునెలల క్రితం సీజన్‌లో హైదరాబాద్‌ మార్కెట్‌లకు రోజుకు 150 నుంచి 200 లారీల టమాటా దిగుమతి అయితే ప్రస్తుతం 200 నుంచి 250లారీల వరకూ పెరిగినట్టు వ్యాపారులుతెలిపారు. కొన్ని సార్లు మరింత ఎక్కువగానే వస్తున్నాయని వ్యాపారులుచెబుతున్నారు. దీంతో ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో టమాటా ధర 3 నుంచి 4 రూపాయలు పలుకుతోంది. కానీ రిటైల్‌మార్కెట్‌లో కిలో టమాటా 8 నుంచి 15 రూపాయలకే అమ్ముతున్నారు. ఇకపచ్చిమర్చి కూడా భారీగా దిగుమతి అవుతోంది. కొన్నిరోజుల క్రితం కిలో పచ్చిమిర్చి కిలో 80 రూపాయల వరకు చేరింది. కానీ ప్రస్తుతం 30నుంచి 40 రూపాయలుపలుకుతోంది. బిన్నీసు ధర కిలో 200 రూపాయల వరకూ ఎగబాకింది. కానీ ప్రస్తుతం కిలో 40 రూపాయలు పలుకుతోంది. ఇక ఆలుగడ్డ ధరలు సైతం భారీగా దిగుమతి అవుతుండడంతో రిటైల్‌మార్కెట్‌లో కిలో 25 నుంచి 30 రూపాయలుపలుకుతోంది. క్యాప్సికం, క్యారట్‌, గోకరకాయ, బీర, బీట్‌రూట్‌, దొండ, ఇలా రక రకాల కూరగాయల దిగుమతి పెరిగింది. దీంతో ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున ఇతరరాష్ర్టాల నుంచి కూరగాయల దిగుమతి పెరగడంతో ధర పడిపోవడం వల్ల తెలంగాణ రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-02-20T22:11:27+05:30 IST