వెజిట్రబుల్స్‌

ABN , First Publish Date - 2021-10-11T05:47:13+05:30 IST

కూరగాయాల ధరలు మళ్లీ కొండెక్కాయి.

వెజిట్రబుల్స్‌

కొండెక్కిన కూరగాయల ధరలు

 పది రోజుల్లోనే సగానికి సగం పెరుగుదల

 వానలతో దెబ్బతిన్న పంటలు

చిక్కుడు కేజీ రూ.120, వంగ రూ.50, టమాట రూ.40

నరసాపురం, అక్టోబరు 10: కూరగాయాల ధరలు మళ్లీ కొండెక్కాయి. వానలు దెబ్బకు చాలా చోట్ల పంటలు నాశనమయ్యాయి. దీంతో దిగుబడి తగ్గింది. డిమాండ్‌కు సరఫరా సప్లై లేదు. ఈ కారణంగా అన్ని రకాల కూరగా యల ధరలు పది రోజుల్లోనే సగానికి సగం రెట్టింపు అయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో చిక్కుడు గత నెలలో కేజీ రూ.60 ఉండేది. నేడు రూ.120కు చేరింది. టమాట పరిస్థితి కూడా ఇంతే. రూ.20 నుంచి రూ.40 కు చేరింది. వంకాయ ధర రెండు రకాలుగా ఉంది. పెన్నాడ ధర కేజీ రూ.50కు వెళ్లింది. అదే కృష్ణా జిల్లా రకం అయితే కేజీ రూ.40 ఉంది. గత నెలలో కేజీ రూ. 20 మాత్రమే ఉండేది. ఇక బెండ, దొండ కూడా రూ.20 నుంచి రూ.40కు పెరిగాయి. బీర రూ.30 నుంచి రూ.50కు వెళ్లింది. క్యాప్సి కం కేజీ రూ.80కు చేరింది. క్యారెట్‌, బీట్‌రూట్‌ ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. గత నెలలో బీట్‌రూట్‌ కేజీ రూ.20 ఉండేది. నేడు రూ.40 అయింది. క్యారెట్‌ కూడా రకాన్ని బట్టి రూ.40 నుంచి రూ.50కు విక్రయిస్తున్నారు. తక్కువ ధరలో దొరికే ఆనపకాయ, దోస ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. కేజీ దోస రూ.30 అమ్ముతున్నారు. ఆనపకాయ కూడా సైజ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 పలుకుతుంది.

 ఉల్లి ఘాటు.. 

వర్షాల ప్రభావం ఉల్లిపంటపై కూడా చూపింది. కర్నూల్‌, మహారాష్ట్రలో కూడా పంటలు దెబ్బతినడంతో ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత నెలలో కర్నూల్‌ రకం కేజీ రూ.18 ఉండే ది. ప్రస్తుతం రూ.25కు చేరి టంది. ఇక మహారాష్ట్ర ఉల్లి కేజీ సైజ్‌ను బట్టి రూ.25 నుంచి రూ.30 ఉండేది. ఇప్పుడు రూ. 40కు చేరింది. ఇప్పట్లో దిగుబడి వచ్చే అవకా శం లేదు. మరో పంట చేతికి రావాలంటే రెండు నుంచి మూడు నెలలు పడుతుందని వర్తకులు చెబుతున్నారు.


Updated Date - 2021-10-11T05:47:13+05:30 IST