Advertisement
Advertisement
Abn logo
Advertisement

శాకాహార మొసలి!

మొసలి మాంసాహారం తింటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ కేరళలోని కాసర్‌గోడ్‌లో ఉన్న ఒక ఆలయ కొలనులో ఉండే మొసలి మాత్రం శాకాహారమే తింటుంది. ఏడు దశాబ్దాలుగా ఆలయ ప్రాంగణంలోని కొలనులో ఉంటున్న ఆ మొసలి పూజారి పెట్టే నైవేద్యాన్ని ఆహారంగా తీసుకుంటుండం విశేషం. కేరళలోని కాసర్‌గోడ్‌లో ఉన్న శ్రీఅనంతపద్మనాభస్వామి లేక్‌ టెంపుల్‌లో ఉన్న మొసలి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.


ఈ మొసలి పేరు బబియా. ఇప్పటి వరకు ఈ మొసలి ఎవ్వరికీ ఎలాంటి హాని చేయలేదు. రోజూ ఉదయం, మధ్యాహ్నం అన్నంను ఆహారంగా అందిస్తారు. ఈ మొసలి మాంసాహారం ముట్టదు. అంతేకాదు ఆ కొలనులో ఉన్న చేపలను సైతం ఆహారంగా తీసుకోదు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు మొసలిని తప్పక చూసి వెళుతుంటారు.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...