మొక్కలునాటి, సంరక్షించాలి: అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-06-23T06:37:34+05:30 IST

దేవరకొండ మునిసిపాలిటీ ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలునాటి వాటిని సంరక్షించాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ మునిసిపల్‌ అధికారులను కోరారు.

మొక్కలునాటి, సంరక్షించాలి: అదనపు కలెక్టర్‌
వన నర్సరీని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

దేవరకొండ, జూన్‌ 22:  దేవరకొండ మునిసిపాలిటీ ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలునాటి వాటిని సంరక్షించాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ మునిసిపల్‌ అధికారులను కోరారు. మంగళవారం దేవరకొండలో హరితహారం కార్యక్రమంలో భాగం గా పట్టణ ప్రకృతివనాలను, ప్లాంటేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు మొక్కలను సంరక్షించవలసిన బాధ్యత అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. అనంతరం దేవరకొండ ఖిల్లాలోని పార్కు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట దేవరకొండ మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ; కమిషనర్‌ వెంకటయ్య, ఏఈ రాజు, మురళి ఉన్నారు. 

Updated Date - 2021-06-23T06:37:34+05:30 IST