ఈ హైవేపై వాహనాలు నిషేధం!

ABN , First Publish Date - 2021-03-03T05:36:07+05:30 IST

హైవే అంటే వాహనాలతో రద్దీగా ఉంటుంది. కానీ అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రంలోని ఎం-185 హైవేపై ఒక్క వాహనం కనిపించదు. ఎందుకో తెలుసా? ఆ హైవేపై వాహనాలు తిరగడం నిషేధం. అందుకే అది అమెరికాలో సేఫెస్ట్‌ రోడ్‌గా గుర్తింపు పొందింది.

ఈ హైవేపై వాహనాలు నిషేధం!

హైవే అంటే వాహనాలతో రద్దీగా ఉంటుంది. కానీ అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రంలోని ఎం-185 హైవేపై ఒక్క వాహనం కనిపించదు. ఎందుకో తెలుసా? ఆ హైవేపై వాహనాలు తిరగడం నిషేధం. అందుకే అది అమెరికాలో సేఫెస్ట్‌ రోడ్‌గా గుర్తింపు పొందింది.

  • ఈ హైవే ద్వీపంలో ఉంది. అంతేకాకుండా ఇతర హైవేలతో దీనికి లింక్‌ లేదు. వృత్తాకారంలో ఉంటుంది. ఈ హైవే ప్రయాణం చేస్తే ఎక్కడ నుంచి ప్రారంభించారో అక్కడికే చేరుకుంటారు. 
  • ఈ హైవేపై వాహనాలు ప్రయాణించకూడదని 1898లో ఆర్డినెన్స్‌ జారీ చేశారట. అక్కడే నివసించే ఒక డాక్టర్‌ కారు శబ్దం వల్ల గుర్రాలు బెదిరి, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో హైవేపైకి వాహనాలను నిషేధించారు. గుర్రపు బగ్గీలు, సైకిళ్లను మాత్రమే అనుమతించారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అత్యవసర సమయాల్లో మాత్రం అంబులెన్స్‌, ఫైర్‌ ఇంజన్‌ వంటి వాటికి అనుమతిస్తారు.
  • ఎం-185 హైవేను నేషనల్‌ హైవే సిస్టమ్‌లో చేర్చలేదు. అమెరికాలో ఉన్న ముఖ్యమైన హైవేలు, రహదారుల జాబితాతో ఇండెక్స్‌ ఉంటుంది. అందులో ఈ హైవే పేరు లేదు. అయినా ఈ రోడ్డును స్థానికులు హైవే అని పిలుస్తుంటారు.
  • ఈ హైవేను సైక్లిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మాకినాక్‌ ద్వీపంలోని స్టేట్‌ పార్క్‌ విజటర్‌ సెంటర్‌ ఎదురుగా హైవే స్టార్టింగ్‌ పాయింట్‌ను సూచించే ‘0’ గుర్తును ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-03-03T05:36:07+05:30 IST