Abn logo
Jun 13 2021 @ 03:06AM

సరిహద్దుల్లో వాహనాల బారులు

ఈ-పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి 


జగ్గయ్యపేట రూరల్‌, జూన్‌ 12: ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జాతీయ రహదారిపై శనివారం వాహనాలు బారులు తీరాయి. వారాంతం కావడంతో పాటు ఆయా పనులపై ఏపీ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న వాహనాలను తెలంగాణలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అత్యవసర, ఈ-పాస్‌ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, మిగిలిన వాహనాలను అనుమతించేది లేదని తేల్చిచెబుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ-పాస్‌ ఉన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నామని, నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నామని ఆ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేస్తున్నారు.