15 రోజుల్లో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-12-01T07:16:38+05:30 IST

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంగా పలువాహనాలపై విధించిన పెండింగ్‌లో ఉన్న చలాన్లు 15 రోజు ల్లోగా చెల్లించాలని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

15 రోజుల్లో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లించాలి : ఎస్పీ
జిల్లా సెషన్స్‌ ప్రధాన న్యాయమూర్తి సునీత రామకృష్ణను అభినందిస్తున్న ఎస్పీ

నిర్మల్‌ కల్చరల్‌, నవంబరు 30 : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంగా పలువాహనాలపై విధించిన పెండింగ్‌లో ఉన్న చలాన్లు 15 రోజు ల్లోగా చెల్లించాలని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. లేనట్లయితే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించా రు. వాహనదారులు మూడు లేదా నాలుగుకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌ లో ఉంచరాదన్నారు. అలాంటి వాటిని సీజ్‌ చేస్తామన్నారు. ట్రాఫిక్‌ నిబంధన లు పాటిస్తూ వాహనాలు నడపాలని, పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. అతివేగాన్ని నియంత్రించాలని, 18 ఏళ్లలోపు వారు వాహనాలు నడిపితే తల్లి దండ్రులు బాధ్యులవుతారన్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాలన్నారు. పరిమిత సంఖ్యలో ప్రయాణికులను తీసుకుని సురక్షితంగా గమ్యం చేరాల న్నారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ నేరమన్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. 

హోంగార్డ్‌ కుటుంబాలకు పోలీసుశాఖ అండ 

హోంగార్డ్‌ కుటుంబాలకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ సిహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం బాధిత హోంగార్డ్‌ కూతురుకు వెల్ఫేర్‌ఫండ్‌ చెక్కు అందించారు. లోకేశ్వరం మండలం బిలోలికి చెందిన కవిత బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ ఏప్రిల్‌ 28న మృతి చెందింది. ఆమె కూతురు సాయి స్వీజారావుకు పోలీస్‌శాఖ వెల్ఫేర్‌ ఫండ్‌ చెక్కు జిల్లా కార్యాలయంలో అందించారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, హోంగార్డ్‌, ఆర్‌ రామకృష్ణ పాల్గొన్నారు. 

ఉమ్మడి జిల్లా నూతన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రధాన జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి సునీత రామకృష్ణను మంగళవారం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అటవీశాఖ అతిథిగృహంలో ఆమెకు స్వాగతం పలికి మొక్కను అందజేశారు. పట్టణ సీఐ శ్రీనివాస్‌తో పాటు పలువురు జిల్లా న్యాయమూర్తిని కలిసిన వారిలో ఉన్నారు. 


Updated Date - 2021-12-01T07:16:38+05:30 IST