Advertisement
Advertisement
Abn logo
Advertisement

నవంబరులో వాహన విక్రయాలిలా...

హైదరాబాద్ : కిందటి(నవంబరు) నెలలో వాహన విక్రయాలు నవంబరు నెలలో బాగా తగ్గాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహనరంగంలో ఉత్పత్తి తగ్గింది. అమ్మకాల పై ఇది ప్రభావం చూపింది. కాగా... మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కంపెనీల అమ్మకాలు మాత్రం పెరిగాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ నవంబరు  నెలలో 15 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ మాత్రం ఏడాది ప్రాతిపదికన 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రా సేల్స్ గతేడాది నవంబరు నెలతో పోలిస్తే ఏడు శాతం పెరిగాయి. ద్విచక్రవాహనాల విక్రయాలు కూడా తగ్గాయి. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ విక్రయాలు వరుసగా 29 శాతం, 20 శాతం, 41 శాతం, 35 శాతం మేర క్షీణించాయి.


కాగా... భారత అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా విక్రయాలు నవంబరు  నెలలో 9 శాతం క్షీణించాయి. గతేడాది నవంబరు  నెలలో 1,53,223 యూనిట్ల అమ్మకం జరగగా, ఈ నవంబరులో 1,39,184 కి పడిపోయాయి. డొమెస్టిక్ వాహనాల అమ్మకాలు 18 శాతం క్షీణించి,  1,44,219 యూనిట్ల నుండి 1,17,791 కు పడిపోయాయి. మినీ సెగ్మెంట్‌కు సంబంధించి... ఆల్టో, ఎస్-ప్రెస్సో విక్రయాలు 21 శాతం, కాంపాక్ట్ సెగ్మెంట్‌లో బాలెనో, సెలారియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగన్ ఆర్ వాహనాల అమ్మకాలు 25 శాతం, తగ్గిపోయాయి. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అమ్మకాలు మాత్రం కాస్గ పెరగడం గమనార్హం. 


ప్రయాణికుల వాహనాల అమ్మకాలు జంప్... మహీంద్రా అండ్ మహీంద్రా నవంబరు నెలలో 40,102 యూనిట్లను విక్రయించింది. పాసింజర్ వెహికిల్ అమ్మకాలు ఏడు శాతం పెరిగాయి. కమర్షియల్ వాహనాల అమ్మకాలు మాత్రం 23 శాతం క్షీణించాయి. ఎగుమతులు 90 శాతం పెరిగి 1636 యూనిట్ల నుండి 3101 యూనిట్లకు చేరుకున్నాయి. ఎస్‌యూవీ వాహనాల అమ్మకాలు ఎనిమిది శాతం పెరిగాయి. ఎంజీ మోటార్స్ ఇండియా రిటైల్ అమ్మకాలు 40 శాతం క్షీణించాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఈ అమ్మకాలు పడిపోయాయి. బజాజ్ ఆటో అమ్మకాలు గతేడాది నవంబరులో 4,22,240 యూనిట్లు కాగా, పది శాతం క్షీణించి 3,79,276 కు పడిపోయాయి. గత నెలలో డొమెస్టిక్ సేల్స్ కూడా 1,98,933 యూనిట్ల నుండి 20 శాతం తగ్గి 1,58,755 యూనిట్లకు పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 3,84,993 నుండి 3,38,473 యూనిట్లకు తగ్గాయి. కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు మాత్రం 37,247 నుండి పది శాతం పెరిగి, 40,803 యూనిట్లకు చేరుకున్నాయి. టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 15 శాతం క్షీణించి,  3,22,709 యూనిట్ల నుండి 2,72,693 యూనిట్లకు తగ్గిపోయాయి. డొమెస్టిక్ టూ వీలర్ అమ్మకాలు 2.47 లక్షల నుండి 1.75 లక్షలకు పడిపోయాయి. హ్యుండాయ్ మోటార్ అమ్మకాలు 21 శాతం క్షీణించి, 59,200 యూనిట్ల నుండి 46,910 యూనిట్లకు పడిపోయాయి.


టాటా మోటార్స్ అమ్మకాలు జంప్...

ఎస్కార్ట్ అమ్మకాలు 30 శాతం క్షీణించి, 7,116 యూనిట్లకు తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే నంబరు నెలలో 10,165 యూనిట్లను విక్రయించింది. డొమెస్టిక్ ట్రాక్టర్ల అమ్మకాలు 32 శాతం తగ్గాయి. అయితే ఎగుమతులు మాత్రం 24 శాతానికి పైగా పెరగడం విశేషం. అశోక్ లేలాండ్ అమ్మకాలు నాలు శాతం క్షీణించి,  9,727 యూనిట్ల నుండి 9,364 యూనిట్లకు చేరుకున్నాయి. ఐషర్ మోటార్ అమ్మకాలు పది శాతం క్షీణించి, 4,085 యూనిట్లకు తగ్గాయి. కమర్షియల్ వెహికిల్ అమ్మకాలు మాత్రం పెరిగాయి. టాటా మోటార్స్ అమ్మకాలు ఏకంగా 25 శాతం పెరిగి, 49,650 యూనిట్ల నుండి 62,192 యూనిట్లకు చేరుకున్నాయి. డొమెస్టిక్ హోల్‌సేల్ విక్రయాలు 21 శాతం పెరిగాయి.

Advertisement
Advertisement