పెరగనున్న వాహన ‘ధర’లు

ABN , First Publish Date - 2021-07-28T20:16:22+05:30 IST

ఆయా ఆటో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించాయి.

పెరగనున్న వాహన ‘ధర’లు

హైదరాబాద్ : ఆయా ఆటో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించాయి. మరిన్ని కంపెనీలు అదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారంలో పాసింజర్ వెహికిల్ సేల్స్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంజ్ పాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ అధికారి  శైలేష్ చంద్ర తెలిపారు. ‘ఇన్‌పుట్ ఖర్చులు ఇప్పటికే భారీగా పెరిగాయి. కస్టమర్లపై కాస్త భారం తప్పడం లేదు’ అని పేర్కొన్నారు.


ఆగస్టు మొదటి వారం నుండి అన్ని రకాల పాసింజర్ వాహనాల ధరలను పెంచాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. స్టీల్, ఇతర విలువైన ఎసెన్షియల్ మెటిరీయల్ ధరలు పెరిగాయని, దీంతో కంపెనీలపై భారం పడుతోందని, ఇందులో కొంత మొత్తం కస్టమర్ల పైకి మళ్ళిస్తున్నామని వెల్లడించారు.  గతేడాది ఇదే కాలంలో ఉక్కు, విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయని, దీంతో ఈ ప్రభావం ఆదాయంపై 8-8.5 శాతం మేర పడిందని శైలేంద్ర చంద్ర తెలిపారు. కాగా... కంపెనీ రియలైజేషన్ ప్రాస్పెక్టివ్ నుండి ఈ భారం 2.5 శాతముంటుందని, ఎక్స్-షోరూం ధర ప్రకారం ఇది మూడు శాతం మాత్రమేనని తెలిపారు. అధిక వ్యయభారం తగ్గించుకునే క్రమంలో... కంపెనీ వివిధ చర్యలు చేపడుతోందని తెలిపారు. అయితే అంతరం ఇంకా ఉండటంతో కస్టమర్లపై కాస్త భారం మోపుతున్నామన్నారు. 

Updated Date - 2021-07-28T20:16:22+05:30 IST