వెలిగొండ నిర్వాసితులకు మెరుగైన పరిహారం

ABN , First Publish Date - 2020-08-05T11:34:52+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన నష్టపరిహారం చెల్లిస్తోందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ చెప్పారు.

వెలిగొండ నిర్వాసితులకు మెరుగైన పరిహారం

జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్లడి

ప్రత్యేక కమిషనర్‌తో కలిసి కాకర్ల కెనాల్‌ ఏర్పాట్ల పరిశీలన


కంభం(అర్థవీడు), ఆగస్టు 4 : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన నష్టపరిహారం చెల్లిస్తోందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ చెప్పారు. ఇతర ప్రాజెక్టుల కంటే మిన్నగా ప్యాకేజీ ఇస్తున్నా మన్నారు. ఆయన అర్థవీడు మండలం కాకర్ల గ్రామ పరిధిలోని సాయిరామ్‌ నగర్‌ వద్ద గొట్టిపడియ-కాకర్ల కెనాల్‌ పనుల ఏర్పాట్లను రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్‌ టి.బాబూరావునాయుడుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ పనులు అక్టోబర్‌ ఆఖరుకు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వెలిగొండ ముంపు గ్రామమైన సాయిరామ్‌ నగర్‌లో 16 మందికి వన్‌ టైం సెటిల్మెంట్‌ కింద రూ. 2 కోట్లను వారి ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు.


పునరావాస కేంద్రాల్లో గృహనిర్మాణాలు చేపట్టడానికి టెండ ర్లు పిలిచామన్నారు. రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్‌ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ పన్నెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మురళి, వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్‌ గంగాధర్‌గౌడ్‌, ఉపకలెక్టర్‌ విజయ్‌కుమార్‌, మార్కాపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారి శేషిరెడ్డి, ఎస్‌ఈ నగేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-05T11:34:52+05:30 IST