నిర్వాసితుల స్థలాలకు లేఅవుట్లు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2020-08-11T10:38:09+05:30 IST

వెలిగొండ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల నిర్వాసితులకు గృహ నిర్మాణాలు చేపట్టడానికి లేఅవుట్లు సిద్ధం చేయాలని ఆర్డీవో ఎం. శేషిరెడ్డి అధికారులను ..

నిర్వాసితుల స్థలాలకు లేఅవుట్లు సిద్ధం చేయాలి

మార్కాపురం, ఆగస్టు 10 : వెలిగొండ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల నిర్వాసితులకు గృహ నిర్మాణాలు చేపట్టడానికి లేఅవుట్లు సిద్ధం చేయాలని ఆర్డీవో ఎం. శేషిరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాస చర్యలు కల్పించడానికి ఏర్పాటు చేసిన మార్కాపురం మండలం వేములకోట, బేస్తవారపేట మండలం ఒందుట్లలో స్థలాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్లు భాగ్యలక్ష్మి, సుబ్బారావు ఉన్నారు. 

Updated Date - 2020-08-11T10:38:09+05:30 IST