దసరా ఉత్సవాల‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్ష

ABN , First Publish Date - 2020-09-19T21:27:52+05:30 IST

దసరా ఉత్సవాల‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈసారి దసరా ఉత్సవాల టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. దసరా సమయంలో రోజుకు 10 వేల మందిని

దసరా ఉత్సవాల‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్ష

విజయవాడ: దసరా ఉత్సవాల‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈసారి దసరా ఉత్సవాల టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. దసరా సమయంలో రోజుకు 10 వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నామని, 4 వేల మందిని ఉచిత దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 9 రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరాలో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనబర్జనలో ఉన్నారు. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా దుర్గగుడి అధికారులు ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు.

Updated Date - 2020-09-19T21:27:52+05:30 IST