కొండాలమ్మ సేవలో మంత్రి కొడాలి నాని

ABN , First Publish Date - 2020-10-25T09:57:36+05:30 IST

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వేమవరం శ్రీకొండామ్మ అమ్మవారు శనివారం శ్రీకనకదుర్గా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

కొండాలమ్మ సేవలో మంత్రి కొడాలి నాని

గుడ్లవల్లేరు, అక్టోబరు 24 :భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వేమవరం శ్రీకొండామ్మ అమ్మవారు శనివారం శ్రీకనకదుర్గా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  దేవీ శరన్నావరాత్ర ఉత్సవాలల్లో భాగంగా కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సహస్ర కుంకమార్చన, సకల కాలసర్ప  దోష నివారణకు  శ్రీదుర్గా  మూలమంత్ర హోమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి  మంత్రి  కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దంపతులు అమ్మవారికి ప్రత్యేకపూజలను నిర్వహించారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆలయ పరిసరాల్లో అమ్మవారి ఉత్సవ మూర్తిని పల్లకీలో ఊరేగించారు. పల్లకీ  మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. 


ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రి కొడాలి నాని కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్‌ షణ్ముగం, ఆలయ పాలక మండలి చైర్మన్‌ కనుమూరి రామిరెడ్డి, పాలకవర్గ సభ్యులు బాడిగ లీలా సౌజన్య, మన్నెం అమల, డోకాల భాగ్యలక్ష్మి, వల్లూరి పద్మావతి, నారేపాలెం వెంకట నిర్మల, ఈడే విజయనిర్మల, పడవల వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటస్వామి, పాలడుగు రాంప్రసాద్‌, అల్లూరి ఆంజనేయిలు, డోకాల కనకరత్నం,ఆలయ మాజీ చైర్మన్‌ తాళ్ళూరి మాధవ, ఆలయ ప్రధానార్చకులు శివసంతోష్‌ శర్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T09:57:36+05:30 IST