Abn logo
Sep 25 2021 @ 23:28PM

వేంపల్లె సమగ్రాభివృద్ధే లక్ష్యం : జడ్పీటీసీ

జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డిని సత్కరిస్తున్న నేతలు అంతర్‌ చిత్రంలో ప్రమాణం చేస్తున్న రవికుమార్‌రెడ్డి

వేంపల్లె, సెప్టెంబరు 25: వేంపల్లె సమగ్రాభివృద్ధే ఏకైక లక్ష్యమని జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వేంపల్లె మండల జడ్పీటీసీగా ఏకగ్రీ వంగా ఎన్నికైన రవికుమార్‌రెడ్డి కడప జడ్పీ హాలు లో శనివారం ప్రమాణం చేశారు. అనంతరం వేంపల్లె చేరుకున్న ఆయనకు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమం త్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవి నాష్‌రెడ్డి, వైసీపీ నేతలు, ప్రజలు సహకరించినం దుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి రవికుమార్‌రెడ్డిని అభినందించారు. కన్వీనర్‌ చంద్ర ఓబు ళరెడ్డి, అధికారులు, అనధికారులు, శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, సివిల్‌ సపై్ౖలస్‌ డైరెక్టర్‌ షబ్బీర్‌వలి తదితరులు పాల్గొన్నారు.

కోఆప్షన్‌ మెంబర్‌గా కరీముల్లా....

ఖాజీపేట, సెప్టెంబరు 25: జడ్పీటీసీ కోఆప్షన్‌ మెంబర్‌గా ఖాజీపేట వాసి అచ్చుకట్ల కరీముల్లా శనివారం కడప జడ్పీ ఆవరణలో ప్రమాణం చేశారు. అనంతరం ఖాజీపేటకు చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు బస్టాండు కూడలిలో ఘనస్వాగతం పలికారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపు సుంకేసుల రోడ్డు వరకు సాగింది. ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్‌ గంగాధర్‌రెడి ్డ, మండలాధ్యక్షుడు అబూబకార్‌సిద్ధిక్‌, బీఎం, షరీఫ్‌, రాఘవరెడ్డి, కొండారెడి ్డ పాల్గొన్నారు.

ప్రమాణానికి తరలిన నేతలు

మైదుకూరు, సెప్టెంబరు 25: మైదుకూరు జడ్పీటీసీ ప్రసన్నలక్ష్మీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైసీపీ నేతలు ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు తరలివెళ్లారు. కడప జడ్పీలో జరి గిన ప్రమాణోత్సవంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, పట్టణ అధ్యక్షు డు లింగన్న  పాల్గొన్నారు. 

జడ్పీటీసీగా కృష్ణయ్య....

దువ్వూరు, సెప్టెంబరు 25: దువ్వూరు మండల జడ్పీటీసీ సభ్యునిగా శనివారం కృష్ణంపల్లె వాసి మేరువ కృష్ణయ్య ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడి ్డ సహకారంతో జడ్పీటీసీగా ఎన్నికవడం పట్ల వైసీపీ మండల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండల అభివృద్ధికి పాటుపడతానన్నారు. 

జడ్పీటీసీ ప్రమాణానికి భారీగా తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు

బద్వేలు, సెప్టెంబరు 25: గోపవరం జడ్పీటీసీ కలువాయి జయరామిరెడ్డి ప్రమా ణ కార్యక్రమానికి భారీగా టీడీపీ నేతలు తరలివెళ్లారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల నుంచి మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌, కె.రితే్‌షకుమార్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కడపకు తరలివెళ్లారు. ఎల్లారెడ్డి, గోపవరం ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, రామానాయుడు, మిత్తికాయల రమణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగళరెడ్డి, బి.కోడూరు మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వెళ్లారు.

అచ్చుకట్ల కరీముల్లాకు శుభాకాంక్షలు తెలుపుతున్న సిద్ధిక్‌, గంగాధర్‌రెడ్డి