Abn logo
Sep 20 2021 @ 19:42PM

వేములవాడ బ్రిడ్జి నిర్మాణంపై హైకోర్టులో పిల్

హైదరాబాద్‌: వేములవాడ బ్రిడ్జి నిర్మాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్‌ను హైకోర్టు న్యాయవాది రాం ప్రసాద్  దాఖలు చేశారు. 6 నెలల కాలంలో రెండుసార్లు బ్రిడ్జి కూలిపోయిందన్న పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజాధనం వృధా చేస్తూ ప్లానింగ్‌ లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బ్రిడ్జి కూలిందని రెండుసార్లు కాంట్రాక్టర్లు క్లైమ్ చేసుకున్నారని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తెచ్చారు. బ్రిడ్జి కూలిపోవడానికి కారణమైనవారిని ప్రతివాదిగా హైకోర్టు చేర్చింది. వచ్చే బుధవారం పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.

ఇవి కూడా చదవండిImage Caption