Vemulawada రాజన్న సన్నిధిలో సంక్రాంతి రద్దీ

ABN , First Publish Date - 2022-01-17T12:41:26+05:30 IST

దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శని, ఆదివారాల్లో భక్తులతో రద్దీగా మారింది. సంక్రాంతి సందర్భంగా శనివారం

Vemulawada రాజన్న సన్నిధిలో సంక్రాంతి రద్దీ

రాజన్న సిరిసిల్ల : దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శని, ఆదివారాల్లో భక్తులతో రద్దీగా మారింది. సంక్రాంతి  సందర్భంగా శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.  పెద్ద సంఖ్యలో భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు.  స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు.  భక్తులకు ఇబ్బందులు తల్తెకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-01-17T12:41:26+05:30 IST