Abn logo
Sep 28 2021 @ 00:39AM

రాజన్న సన్నిధిలో భక్తుల సందడి

భక్తులతో సందడిగా మారిన రాజన్న ఆలయం

వేములవాడ, సెప్టెంబరు 27 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.  స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకోవడంతో పాటు బాలాత్రిపురాసుందరీ దేవి ఆలయంలో కుంకుమపూజల్లో, కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. అనుబంఽధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వరాలయం సైతం భక్తులతో సందడిగా మారాయి.  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌, ఆలయ సూపరింటెండెంట్లు కామరౌతు రాజశేఖర్‌, గుండి నర్సింహమూర్తి, ప్రొటోకాల్‌ సూపరింటెండెంట్‌ సిరిగిరి శ్రీరాములు, అనుబంధ ఆలయాలసూపరింటెండెంట్‌ కాంచనపల్లి నటరాజ్‌, పీఆర్‌వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

స్వామివారి సేవలో టీఎస్‌పీఎస్సీ సభ్యురాలు

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యురాలు సుమిత్రా ఆనంద్‌ సోమవారం  కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.