Abn logo
Sep 20 2021 @ 03:27AM

ఇక తెలుగులోనే విక్రేతల రిజిస్ర్టేషన్‌ : అమెజాన్‌

న్యూఢిల్లీ: అమెజాన్‌లో విక్రేతలుగా రిజిస్టర్‌ చేసుకోవాలంటే ఇక నుంచి ఆ ప్రక్రియ తెలుగులోనే పూర్తి చేసుకోవచ్చు. తాజాగా సెల్లర్‌ రిజిస్ట్రేషన్‌కు మలయాళం, తెలుగు, బెంగాలీ భాషలను జోడించినట్టు అమెజాన్‌ ప్రకటించింది. దీంతో సెల్లర్‌ రిజిస్ర్టేషన్‌కు అందుబాటులో ఉన్న భాషల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ సదుపాయం కల్పిండంతో ఇంగ్లీష్‌ భాషపై పట్టు లేకపోయినా తెలుగు భాషాప్రియులు విక్రేతలుగా చేరవచ్చని  అమెజాన్‌ తెలిపింది. అమెజాన్‌ సెంట్రల్‌, మొబైల్‌ యాప్‌లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు అమెజాన్‌కు 8.5 లక్షల మంది విక్రేతలున్నారు. దేశవ్యాప్తంగా 2025 నాటికి కోటి ఎంఎ్‌సఎంఈలను డిజిటైజ్‌ చేయాలన్నది అమెజాన్‌ లక్ష్యం.