Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెంగ్‌సర్కార్‌దీ అదే మాట!

న్యూఢిల్లీ: టీ20 కెప్టెన్సీని వదులుకున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన తర్వాత టీమిండియా టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై విస్తృతంగా జరుగుతున్న చర్చపై మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చైర్మన్ వెంగ్‌సర్కార్ కూడా స్పందించాడు. వెంగీ కూడా రోహిత్‌వైపే మొగ్గు చూపాడు. టీ20 కెప్టెన్ కావడానికి రోహిత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా అతడికి అవకాశం వచ్చిన ప్రతిసారి రోహిత్ తనను తాను నిరూపించుకున్నాడని గుర్తు చేశాడు. 2018లో అతడి సారథ్యంలోని భారత జట్టు ఆసియా కప్ గెలుచుకుందని వివరించాడు. దీనిని పక్కనపెడితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. వెంగ్ సర్కార్ సహచరుడు, సెలక్టర్స్ కమిటీ మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ కూడా రోహిత్‌కే ఓటేశాడు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement