Abn logo
Sep 28 2021 @ 19:54PM

ఐఐటీ జోధ్‌పూర్‌లోని జేసీఏఐసీని సందర్శించిన ఉపరాష్ట్రపతి

ఢిల్లీ: ఐఐటీ జోధ్‌పూర్‌లోని JCAICను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఫ్యాబ్ ల్యాబ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ సిస్టమ్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. విద్యా, వైద్యం, వ్యవసాయంలో ప్రజాకేంద్రిత కృత్రిమ మేధ వినియోగం పెరగాలన్నారు. ప్రజాసేవ కోసం వర్సిటీలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని సూచించారు. నూతన కల్పనలే అభివృద్ధి మంత్రాలు కావాలన్నారు.