ఉగ్రవాదాన్ని పోషిస్తున్నది మీరే

ABN , First Publish Date - 2020-12-01T06:56:55+05:30 IST

షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశం వేదికగా పాకిస్థాన్‌ ఉగ్రవాద చర్యలను భారత్‌ తూర్పారబట్టింది. దేశవిఽధానంలో ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా కొన్ని దేశాలు ఉపయోగించుకుంటున్నాయంటూ పాక్‌ పేరును ప్రస్తావించకుండా భారత్‌ విమర్శించింది...

ఉగ్రవాదాన్ని పోషిస్తున్నది మీరే

  • పాకిస్థాన్‌ తీరుపై ఉపరాష్ట్రపతి సీరియస్‌


న్యూఢిల్లీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశం వేదికగా పాకిస్థాన్‌ ఉగ్రవాద చర్యలను భారత్‌ తూర్పారబట్టింది. దేశవిధానంలో ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా కొన్ని దేశాలు ఉపయోగించుకుంటున్నాయంటూ పాక్‌ పేరును ప్రస్తావించకుండా భారత్‌ విమర్శించింది. సోమవారం జరిగిన ఎస్‌సీఓ ప్రభుత్వాధిపతుల మండలి వర్చువల్‌ సదస్సు కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించారు. కాగా, షాంఘై  సహకార సంస్థ దేశాల మధ్య సాంస్కృతిక సమన్వయం, పరస్పర సహకారంలో భాగంగా భారతీయ సాహిత్యంలో అపూర్వమైన 10 ఆధునిక రచనలను అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. ప్రముఖ రచయిత రావిశాస్త్రి రచించిన ప్రసిద్ధ నవల ఇల్లును రష్యా, చైనీస్‌, ఇంగ్లిషు భాషల్లో అనువదించి విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక నుంచి గెలిచిన 10 మంది రాజ్యసభ సభ్యులతో వెంకయ్యనాయుడు సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు.  


Updated Date - 2020-12-01T06:56:55+05:30 IST