గురజాడ రచనలు అభ్యుదయానికి బాటలు వేశాయి: వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2020-09-21T15:34:13+05:30 IST

న్యూఢిల్లీ: అభ్యుదయ కవి గురజాడ అప్పారావు సాంఘిక పరివర్తన కోసం పరితపించారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

గురజాడ రచనలు అభ్యుదయానికి బాటలు వేశాయి: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: అభ్యుదయ కవి గురజాడ అప్పారావు సాంఘిక పరివర్తన కోసం పరితపించారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన రచనలు అభ్యుదయం దిశగా బాటలు వేశాయని పేర్కొన్నారు. ‘‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తమ రచనల ద్వారా సాంఘిక పరివర్తన కోసం పరితపించిన అభ్యుదయ కవి శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.శ్రీ గురజాడ వారి కలం నుంచి జాలువారిన కన్యాశుల్కం, పూర్ణమ్మ, ముత్యాలసరాలు, దిద్దుబాటు వంటి రచనలు అభ్యుదయం దిశగా బాటలు వేశాయి. ప్రజలందరికీ అర్థమయ్యే జీవభాషలో శ్రీ గురజాడ వారు సాగిన అడుగుజాడలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 



Updated Date - 2020-09-21T15:34:13+05:30 IST