అండగా నిలవండి

ABN , First Publish Date - 2020-04-04T11:15:38+05:30 IST

కరోనా బారిన ప్రజలు పడకుండా సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు అన్నారు.

అండగా నిలవండి

బొబ్బిలి, ఏప్రిల్‌ 3:కరోనా బారిన ప్రజలు పడకుండా సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు అన్నారు. శుక్రవారం బొబ్బిలి మునిసిపల్‌ కార్యాలయంలో పట్టణానికి చెందిన వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. కరోనా మహమ్మారిపై పోరుకు వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ప్రజలు అప్రమత్తమై జాగ్రత్తలు పాటిస్తున్నారని దీనికి వైద్యులు, సిబ్బందే కారణ మని తెలిపారు.


వైద్యులంతా సేవాభావంతో ప్రజలు సేవలు అందించాలని కోరారు. అధికార యంత్రాంగానికి తగిన సూచనలు, సలహాలను అందివ్వా లని కోరారు. వైరస్‌ లక్షణాలు లేకపోయినా కొంతమంది భయాందోళనకు గురవుతున్నారని, అటువంటి వారికి కౌన్సెలింగ్‌ చేసి ఆత్మస్థైర్యం పెంపొందిం చాలన్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారు క్వారంటైన్‌కు వెళ్లేలా అవగాహన కల్పించాలని కోరారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.ఎం.నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైద్యులు ఎ.గోపినాథ్‌, జి.బలరాంనాయుడు, పి.జనార్ధనరావు, రామరాజ్యం పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T11:15:38+05:30 IST