Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెంకటేశ్వరరావుకు ఉద్యోగ విరమణ సన్మానం

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 30:విధుల పట్ల నిబద్ధత, బాధ్యతకు మారుపే రు ఆడియో విజివల్‌ సూపర్‌వైజర్‌ జి.వెంకటేశ్వరరావు అని సమాచార శాఖ సహాయ సంచాలకుడు నాగార్జున అన్నారు. స్థానిక గిరిజన భవనంలో మంగళ వారం పదవీ విరమణ సత్కార సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నాగార్జున మాట్లాడుతూ సమాచారశాఖలో 30 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో సంతోషంగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ చేస్తున్నానన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ భవాని, డివిజనల్‌ పీఆర్వోలు మోహనరావు, లక్ష్మణాచార్యులు, రాజు, బాబూరావు, మల్లిబాబు, రాజేష్‌, దుర్గారావు,  జిలాని, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement