‘పట్టణ ప్రగతి’కి నిధుల కొరత లేదు

ABN , First Publish Date - 2020-02-28T11:23:36+05:30 IST

పట్టణ ప్రగతిలో అభివృద్ధికి నిధుల కొరత లేదని క లెక్టర్‌ వెంకట్రావు అన్నారు. భూత్పూర్‌ ము నిసిపాలిటీలోని సిద్దాయపల్లిలోని 1వ వార్డు, అమిస్తాపుర్‌లోని 6వ వార్డులో పట్టణ ప్రగ తి అధికారుల బృందంతో కలిసి గురువారం కలెక్టర్‌ పర్యాటించారు.

‘పట్టణ ప్రగతి’కి నిధుల కొరత లేదు

భూత్పూర్‌ ఆదర్శ మునిసి పాలిటీ కావాలి

మిషన్‌ భగీరథ నీరు స్వఛ్చామైనవి....నీటి వృధ్దా చేయవద్దు

విధులకు గైర్హాజరైన ఏఈని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌


భూత్పూర్‌, ఫిబ్రవరి 27 : పట్టణ ప్రగతిలో అభివృద్ధికి నిధుల కొరత లేదని క లెక్టర్‌ వెంకట్రావు అన్నారు. భూత్పూర్‌ ము నిసిపాలిటీలోని సిద్దాయపల్లిలోని 1వ వార్డు, అమిస్తాపుర్‌లోని 6వ వార్డులో పట్టణ ప్రగ తి అధికారుల బృందంతో కలిసి గురువారం కలెక్టర్‌ పర్యాటించారు. సిద్దాయపల్లిలో అన్ని వీఽధులను పరిశీలించారు. స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు. 


స్వచ్ఛత పాటించని వారిపై చర్యలు తీ సుకోవాలని అధికారులను ఆదేశించారు. ప ట్టణ అభివృద్ధికి పబ్లిక్‌ బడ్జెట్‌ తయారు చే సి, నిధులు కేయించడం జరుగుతుందని చె ప్పారు. మార్చి 4వ తేదీ వరకు నిధులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటా మన్నారు. అంత వరకు మునిసిపాలిటీకి కా వలసిన నిధుల ప్రణాళికను తయారు చే యాలని చెప్పారు. అనంతరం మిషన్‌ భగీర థ నీటిని కలెక్టర్‌ తాగి చూశారు. పట్టణ ప్ర గతి విధులకు గైర్హాజర్‌ అయిన పంచాయతీ రాజ్‌ శాఖ ఏఈ సాయిలీలను సస్పెండ్‌ చే స్తున్నట్లుగా కలెక్టర్‌ చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధికారులు గైర్హాజర్‌ అయితే కఠిమైన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ హెచ్చ రించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజ్‌గౌడ్‌, వార్డు కౌన్సిలర్‌ బాల్‌కోటి, త హసీల్దార్‌ చెన్నకిష్టన్న, కమిషనర్‌ మున్ని, నాయకులు అశోక్‌గౌడ్‌, బ్రహ్మయ్యచారి, చె న్నమ్మ, శంకర్‌,  సదానంద్‌ పాల్గొన్నారు.


కమీషన్‌ డబ్బులుపంపిణీ చేయాలి

భగీరథ కాలనీ : మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు సంబంధించి 2017-18 ఆర్థిక సంఘం కొనుగోలు చేసిన వరి ధాన్యం మార్కెటింగ్‌ కమిషన్‌ డబ్బులు ఆయా మండలాల గ్రామ సంఘాలకు పం పిణీ చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నా రు. గురువారం 2017-18కి సంబంధించి రూ.46,72,465 లక్షల కమిషన్‌ చెక్కును క లెక్టర్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో నారాయ ణపేట డీఆర్‌డీఓ కాళిందినికి అందించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ డీఆర్‌డీఏ పీడీ వెంకట్‌రెడ్డి, ఏపీ శారద పాల్గొన్నారు.


ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కో సం రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ ఆధ్వ ర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావ్‌ ప్రారంభించారు. గ్లోబల్‌ ఆసుప త్రి వారి సహకారంతో జిల్లాలో పని చేస్తు న్న ఉపాధి ఉద్యోగులు ఉచిత వైద్య శిబిరా న్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచిం చారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంపీడీవో వేదావతి, ఏపీఓ ఆనంద్‌, సూపరింటెండెంట్‌ గోవింద్‌రెడ్డి, అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:23:36+05:30 IST