Abn logo
Jan 14 2021 @ 13:58PM

`క్రాక్` సినిమా వెంకీ చేయాల్సిందా?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన `క్రాక్` సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. వరుస పరాజయాలతో డీలా పడిన రవితేజకు మళ్లీ విజయం అందించింది. అయితే ఈ సినిమా కథ ముందుగా సీనియర్ హీరో వెంకటేష్ విన్నారట. 


రవితేజ కంటే ముందుగా వెంకీకి డైరెక్టర్ కథ చెప్పాడట. కథ వెంకీకి బాగా నచ్చిందట. కొన్ని మార్పులు కూడా సూచించారట. అయితే తను `నారప్ప` పనులతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను మొదలు పెట్టడం ఆలస్యం అవుతుందని వెంకీ చెప్పారట. దీంతో గోపీచంద్ అదే కథను రవితేజకు వినిపించి షూటింగ్ ప్రారంభించాడు. 

Advertisement
Advertisement
Advertisement