May 17 2021 @ 15:30PM

సెప్టెంబర్‌లో ‘వెనమ్‌- లెట్‌ దేర్‌ బి కార్నేజ్‌’

టామ్‌ హార్డి హీరోగా నటించిన ‘వెనమ్‌: లెట్‌ దేర్‌ బి కార్నేజ్‌’ చిత్రం ట్రైలర్‌ను సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ తాజాగా రిలీజ్‌ చేసింది. 2018లో వచ్చిన ‘వెనమ్‌’ చిత్రం ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. ఇపుడు దీని సీక్వెల్‌గా ‘వెనమ్‌ : లెట్‌ దేర్‌ బి కార్నేజ్‌’ పేరుతో మరో చిత్రం రానుంది. ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెప్టెంబరులో థియేటర్లలో విడుదలకానుంది. ఆండి సెర్కిస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మైఖేల్‌ విలియమ్స్‌, నవోమీ హ్యారీస్‌, ఊడీ హర్రెల్‌సన్‌ తదితరులు నటించారు. ఊడీ హర్రెల్‌సన్‌ మార్వెల్‌ యూనివర్స్‌లో అతిభయంకరమైన విలన్‌ పాత్ర పోషించారు. ఇపుడు ‘వెనమ్‌’ సీక్వెల్‌లో ఆయన విలన్‌గా నటించడంతో.. ఈ చిత్రం కోసం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ఒరిజినల్‌ వెర్షన్‌ దాదాపు 855 మిలియన్‌ అమెరికా డాలర్ల మేరకు వసూలు చేసింది. ఇపుడు ఈ చిత్రాన్ని సెప్టెంబరులో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని అద్భుతమైన, ఆశ్చర్యగొలిపే సన్నివేశాలను బిగ్‌స్ర్కీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.