వీరారాధన ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-04T05:22:56+05:30 IST

వీరారాధన ఉత్సవాలను శుక్రవారం పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు ప్రారంభించారు.

వీరారాధన ఉత్సవాలు ప్రారంభం
కొణతములతో వీరాచారవంతులు

కారంపూడి, డిసెంబరు3: వీరారాధన ఉత్సవాలను శుక్రవారం పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరాచారవంతులు పూర్వీకుల ఆయుధాలను గంగధార మడుగులో స్నానమాచరింపజేసి నూతనవస్త్రాలతో అలంకరించి వీర్ల దేవాలయంల పూజలు జరిపారు. చెన్నకేశవస్వామి, అంకాళమ్మ ఆలయాల్లో తీర్థం స్వీకరించి పీఠాధిపతి వద్ద ఆశీస్సులు పొందారు. తొలుత ఆలయ ముఖద్వారంపై ఎర్రజెండాను ఎగురవేసిన పీఠాధిపతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం పీఠాధిపతి సమక్షంలో వీరవిద్యావంతులు రాచగావు కథాగానం చేశారు. ఈ కార్యక్రమాన్ని పీఠం నిర్వాహకుడు పిడుగు విజయ్‌కుమార్‌ అయ్యవారు పర్యవేక్షించారు. తొలుత ఎమ్మెల్యే పీఆర్కే ఆయుధ పూజలో పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-04T05:22:56+05:30 IST