‘ఫారెస్ట్‌’ అభ్యర్థులకు 18 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-01-14T09:01:35+05:30 IST

గత నెల 10 నుంచి 24 వరకు రాజమండ్రిలో నిర్వహించిన వాకింగ్‌, మెడికల్‌ టెస్ట్‌లో ....

‘ఫారెస్ట్‌’ అభ్యర్థులకు 18 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): గత నెల 10 నుంచి 24 వరకు రాజమండ్రిలో నిర్వహించిన వాకింగ్‌, మెడికల్‌ టెస్ట్‌లో క్వాలిఫై అయిన ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌(10/2018), ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌(06/2019), ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌(07/2019) అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందని ఏపీపీఎస్సీ సెక్రెటరీ ఆంజనేయులు తెలిపారు. ఆయా అభ్యర్థుల వివరాలు జ్ట్టిఞట://ఞటఛి.్చఞ.జౌఠి.జీుఽ  వెబ్‌సైట్‌లో ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. క్వాలిఫై అయిన అభ్యర్థులు చెక్‌ లిస్టు, అటెస్టేషన్‌ ఫారం, సంబంధిత ఫారాలను మెమోల్లో ప్రస్తావించిన విధంగా కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌ అభ్యర్థులకు ఈ నెల 18-19 తేదీల్లో, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ అభ్యర్థులకు ఈ నెల 20న, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ అభ్యర్థులకు ఈ నెల 21, 22, 25, 27, 28, 29, ఫిబ్రవరి 1-2 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందని వివరించారు. 


Updated Date - 2021-01-14T09:01:35+05:30 IST