విత్తన వేరుశనగ సబ్సిడీ ధరలు ఖరారు

ABN , First Publish Date - 2021-05-08T06:29:30+05:30 IST

విత్తన వేరుశనగ సబ్సి డీ ధరలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ శా ఖ కమిషరేట్‌ నుంచి ఉ త్తర్వులు జారీ చేశారు.

విత్తన వేరుశనగ సబ్సిడీ ధరలు ఖరారు

క్వింటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.8680

40 శాతం సబ్సిడీ వర్తింపు

రైతు వాటా క్వింటాల్‌పై రూ.5208

 అనంతపురం వ్యవ సాయం, మే 7: విత్తన వేరుశనగ సబ్సి డీ ధరలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ శా ఖ కమిషరేట్‌ నుంచి ఉ త్తర్వులు జారీ చేశారు.  క్వి ంటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.8680గా నిర్ణయించారు. ఇందులో 40 శాతం సబ్సిడీ రూ.3472 పోను రైతు వాటా కింద క్వింటాల్‌కు రూ.5208 చెల్లించాల్సి ఉంటుంది. రైతుకు గరిష్టంగా (బస్తా 30 కేజీలు) మూడు బస్తాలు పంపిణీ చేయనున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి రైతు భరో సా కేంద్రాల్లో విత్తన కాయలు కావాల్సిన రైతుల పే ర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈనెల 15న విత్తన పంపిణీ మొదలు పెట్టనున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-05-08T06:29:30+05:30 IST