బ్యాంకు ఖాతాదారులకు ‘గూగుల్ పే’... మరింత ఈజీ

ABN , First Publish Date - 2020-09-23T00:22:00+05:30 IST

గూగుల్ పే వినియోగదారులకు వెసులుబటు. ఈ యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు... తమ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు.

బ్యాంకు ఖాతాదారులకు ‘గూగుల్ పే’... మరింత ఈజీ

ముంబై : వినియోగదారులకు వెసులుబటు. గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు... తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ  యాప్‌లో జత చేసుకోవచ్చు.


ఈ క్రమంలో... ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి.     ఎస్‌బీఐ కార్డ్‌లను గూగుల్ పే ప్లాట్‌ఫామ్ ద్వారా ఉపయోగించొచ్చు. అంటే... గూగుల్  పే,ఎస్‌బీఐ ల భాగస్వామ్యం నేపధ్యంలో ... వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘గూగుల్ పే’ యాప్ ద్వారా కార్డు చెల్లింపులను మూడు పద్ధతుల్లో చేయొచ్చు. 


‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ)’ వెసులుబాటు ఉన్న పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) టర్మినళ్ళ వద్ద... ట్యాప్ అండ్ పే దుకాణాలు, సంస్థల్లో భారత్ క్యూఆర్ కోడ్ స్కానింగ్, క్రెడిట్ కార్డు, ఇతరత్రా కార్డులు భౌతికంగా అవసరంలేకుండానే ఆన్‌లైన్ చెల్లింపులు... ఇలా మూడు రకాలుగా చెల్లింపులు చేయొచ్చు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


గూగుల్ పే వినియోగదారులు... ఇప్పటి రకు యూపీఐ లావాదేవీలను మాత్రేమ నిర్వహించేందుకు వీలుంది. బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీచార్జ్, నగదు బదిలీ వంటి  ప్రక్రియలను... కేవలం బ్యాంకు ఖాతాల నుంచి మాత్రమే ర్వహించుకోవాల్సి ఉండేది. అయితే... ఇప్పుడు గూగుల్ పే ద్వారా... నేరుగా కార్డుతో కూడా లావాదీవీలను నిర్వహించడానికి వీలుంటుంది.


ఇందుకుగాను... ఎస్‌బీఐ కార్డును గూగుల్ పే యాప్‌తో సంధానించుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ(వన్ టైం పాస్‌వర్డ్) ద్వారా సంబంధిత ప్రక్రియ జరుగుతుంది. కాగా... కేవలం ఎస్‌బీఐ కార్డుదారులకు మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా వారి కార్డులను గూగుల్ పేతో  సంధానించుకోవచ్చని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి.


కోటక్ మహీంద్రా బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు కూడా గూగుల్  పే ద్వారా ఈ కొత్త సర్వీసులను వినియోగించుకోవచ్చు. డెబిట్ /  క్రెడిట్  కార్డులను గూగుల్ పే యాప్‌తో సంధానించుకోవడం ద్వారా... కార్డు అవసరం లేకుండా నే... యాప్ ద్వారా నేరుగా చెల్లింపులు చేయొచ్చు.


ఈ కొత్త వెసులుబాటు... వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉంటుందని బ్యాంకు ఖాతాదారులు, అటు వ్యాంకు అధికారవర్గాలు కూడా చెబుతున్నాయి.

Updated Date - 2020-09-23T00:22:00+05:30 IST