Advertisement
Advertisement
Abn logo
Advertisement

బలమైన జట్టుపై విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది: దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్

కేప్‌టౌన్: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ డీఎన్ ఎల్గర్ మాట్లాడుతూ.. భారత్‌లాంటి బలమైన జట్టుపై విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. తమ జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోయినా విజయం సాధించినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందన్నాడు.


సిరీస్‌లో చాలాసార్లు ఒత్తిడికి గురయ్యామని, అయినప్పటికీ కుర్రాళ్లు అద్భుతంగా పుంజుకుని జట్టుకు అపురూప విజయాన్ని అందించిపెట్టారని ప్రశంసించాడు. ప్రపంచంలోని ఏ జట్టుపైన అయినా గెలవగలమన్న నమ్మకాన్ని ఈ విజయం తమకు అందించిందన్నాడు. సిరీస్‌ను గెలుచుకున్నంత మాత్రాన తమ జట్టులో లోపాలు లేవని తాను చెప్పబోనన్నాడు. తర్వాతి సిరీస్‌లలో ఆ లోపాలను అధిగమిస్తామని సఫారీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement