Advertisement
Advertisement
Abn logo
Advertisement

8,050 ఎకరాల్లో నారుమళ్లు ధ్వంసం

15.3 ఎకరాల్లో భూమి కోత

 90 ఎకరాల్లో దెబ్బతిన్న వరినాట్లు 

ప్రాథమికంగా లెక్క తేల్చిన వ్యవసాయ శాఖ 

నెల్లూరురూరల్‌, నవంబరు 29 : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు తోడవడంతో నెల్లూరురూరల్‌ ప్రాంతంలోని 8,050 ఎకరాల్లో నారుమళ్లు ధ్వంసమైయ్యాయని వ్యవసాయ శాఖ నెల్లూరు ఏడీ బాలాజీనాయక్‌ సోమవారం తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని,  మరో 90 ఎకరాల్లో వరి నాట్లు పూర్తిగా నీట మునిగాయని తెలిపారు. 68.75 ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడగా, ఇంకో 15.3 ఎకరాల్లో భూమి కోతకు గురైనట్లు తేల్చామన్నారు. నష్టాలపై ప్రాథమికంగా నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నామన్నారు. గొల్లకందుకూరు, సజ్జాపురం, వెల్లంటి, సౌత్‌మోపూరు, ములుముడి, మాదరాజుగూడూరు ప్రాంతాల్లో రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని చెప్పారు. మంగళవారం నుంచి ఆర్బీకేల్లో 80 శాతం రాయితీపై రైతులకు విత్తనాలు  పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకాల విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. నష్టపోయిన రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement