వెటర్నరీ వైద్య పట్టభద్రులకు నియామక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-04-19T15:21:54+05:30 IST

ప్రభుత్వ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన 1089 మంది వెటర్నరీ వైద్య విద్యార్థులకు సచివాలయంలో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ నియామక

వెటర్నరీ వైద్య పట్టభద్రులకు నియామక ఉత్తర్వులు

 చెన్నై: ప్రభుత్వ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన 1089 మంది వెటర్నరీ వైద్య విద్యార్థులకు సచివాలయంలో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ నియామక ఉత్తర్వులను అందజేశారు. వీరిని వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జెన్లు నియమించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. గత పదేళ్లుగా వెటర్నరీ డాక్టర్ల పోస్టులు భర్తీకాకపోవడంతో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు తొలివిడతగా 1089 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి అనితా రాధాకృష్ణన్‌, మత్స్యశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి తెన్‌కాశి ఎస్‌. జవహర్‌, పశుసంవర్థక వైద్య సేవల కమిషనర్‌ ఎ.జ్ఞానశేఖరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-19T15:21:54+05:30 IST