Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌కి 2023లో ప్రజలు గుణపాఠం చెబుతారు: వీహెచ్

హైదరాబాద్: అంబేద్కర్ ఆలోచనలు తెలంగాణలో అమలు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఉండే ఒక సర్పంచ్‌పై కేసు పెట్టారన్నారు. అధికారులని సస్పెండ్ చేయకపోతే చలో ఆత్మకూర్‌కి వెళతామన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. సీఎం కేసీఆర్‌కి 2023లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. డిసెంబర్ 9 తరువాత తాను వరి కుప్పల దగ్గరే ఉంటానన్నారు. సోనియాగాంధీ పుట్టిన రోజు తర్వాత ధాన్యం ఎట్లా కొనరో తామూ చూస్తామని వీహెచ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement