మల్లారెడ్డి, పల్లా, పువ్వాడలపై చర్యలేవి?: వీహెచ్

ABN , First Publish Date - 2021-05-04T19:36:03+05:30 IST

హైదరాబాద్: అవినీతిపై సీఎం కేసీఆర్ స్పీడ్‌గా విచారణ జరిపించడం సంతోషించదగ్గ పరిణామమని.. కానీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు ఉన్నాయని..

మల్లారెడ్డి, పల్లా, పువ్వాడలపై చర్యలేవి?: వీహెచ్

హైదరాబాద్: అవినీతిపై సీఎం కేసీఆర్ స్పీడ్‌గా విచారణ జరిపించడం సంతోషించదగ్గ పరిణామమని.. కానీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు ఉన్నాయని.. వాళ్లపై ఎందుకు చర్యల్లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంత్రి మల్లారెడ్డి మీద ఎన్ని బెదిరింపులు, ఎన్ని భూకబ్జాల ఆరోపణలు ఉన్నాయి? అయినా ఎందుకు చర్యలు లేవు? ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కబ్జాల గురించి ఎందుకు చర్యలు లేవు? ఒక్కొక్కరికి ఒక్కక్క న్యాయమా? కరోనా గురించి అంతో ఇంతో కష్టపడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పైన చర్యలు తీస్కున్నావ్.. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్న మిగిలిన వారి పైన చర్యలు తీసుకోకపోతే మేము పోరాటం చేస్తాం. ఈటలను మేం వెనకేసుకు రావడం లేదు.. అందరిపై ఇలాగే చర్యలు తీసుకోవాలి. ఈటల తప్పు చేస్తే శిక్షించాల్సిందే’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2021-05-04T19:36:03+05:30 IST