Abn logo
Jun 3 2021 @ 13:44PM

కాంగ్రెస్‌లో 42 ఏళ్లుగా ఉన్నా.. మా వాళ్లే నన్ను తిడుతున్నారు: వీహెచ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో 42 సంవత్సరాలుగా ఉన్నాననని.. అలాంటి తనను తన పార్టీవాళ్లే తిడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్, పీసీసీగా పని చేశానని తనను ఇప్పటి వరకూ ఏ పార్టీ వాళ్ళూ దూషించలేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వాళ్లు తనను ఫోన్ చేసి తిడుతున్నారన్నారు. తనను తిడితే గాంధీ భవన్‌లో జానారెడ్డి ఖండించారని వీహెచ్ పేర్కొన్నారు. పీసీసీ మాత్రం ఖండించలేదన్నారు. తనకు రక్షణ కల్పించమని పోలీసులను కోరానన్నారు. రెడ్డిలకే పీసీసీ ఇవ్వాలి అనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను బీసీలకి ఇవ్వమని చెబుతున్నానని.. ఒకవేళ రేవంత్‌కి పీసీసీ ఇస్తే గాంధీ భవన్‌కి రానియ్యరన్నారు. బహిరంగంగా మీడియాలో తనను తిడితే క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. తాను చనిపోయే వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. తమ పార్టీలో కోవర్ట్స్ ఉన్నారని.. ముందు నుంచే తాను ఈ విషయం చెబుతున్నానని వీహెచ్ పేర్కొన్నారు.