గుజరాత్‌ ఐ-హబ్‌తో వి-హబ్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2021-01-17T06:38:34+05:30 IST

నిధుల సమీకరణలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల స్టార్ట్‌పలను ప్రోత్సహించడానికి గుజరాత్‌ ప్రభుత్వానికి చెందిన ఐ

గుజరాత్‌ ఐ-హబ్‌తో    వి-హబ్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నిధుల సమీకరణలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల స్టార్ట్‌పలను ప్రోత్సహించడానికి గుజరాత్‌ ప్రభుత్వానికి చెందిన ఐ-హబ్‌తో వి-హబ్‌ చేతులు కలిపింది.  ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో వి- హబ్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శనివారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల మంత్రి కే తారక రామారావు సమక్షంలో ఒప్పందంపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, గుజరాత్‌ ఉన్నత విద్యా ప్రిన్సిపల్‌ సెక్రటరీ అంజు శర్మ సంతకాలు చేశారు.


 ఈ ఒప్పందానికి అనుగుణంగా తెలంగాణ, గుజరాత్‌లోని ఎడ్యుటెక్‌, మెడ్‌టెక్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లోని 240 మంది  ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రీ ఇంక్యుబేషన్‌ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత తుది కో-ఇంక్యుబేషన్‌ కార్యక్రమానికి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు వి-హబ్‌ వెల్లడించింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగడానికి వి-హబ్‌ దోహదం చేస్తుందని మంత్రి కే తారక రామారావు అన్నారు. 


Updated Date - 2021-01-17T06:38:34+05:30 IST