వేగవంతమైన 4జీ మొబైల్ నెట్‌వర్క్‌గా వీఐ

ABN , First Publish Date - 2020-10-30T03:05:16+05:30 IST

వీఐ (వొడాఫోన్ ఐడియా) దేశంలో అత్యంత వేగవంతమైన మొబైల్ ఆపరేటర్‌గా అవతరించింది. నెట్‌వర్క్ అనలిస్ట్ ఊక్లా ప్రకారం..

వేగవంతమైన 4జీ మొబైల్ నెట్‌వర్క్‌గా వీఐ

న్యూఢిల్లీ: వీఐ (వొడాఫోన్ ఐడియా) దేశంలో అత్యంత వేగవంతమైన మొబైల్ ఆపరేటర్‌గా అవతరించింది. నెట్‌వర్క్ అనలిస్ట్ ఊక్లా ప్రకారం.. 4జీ నెట్‌వర్క్‌లో మూడో త్రైమాసికంలో వొడాఫోన్ ఫాస్టెస్ట్ మొబైల్ ఆపరేటర్‌గా రికార్డులకెక్కింది. అయితే, వేగం విషయంలో వివిధ నగరాల మధ్య తేడా ఉంది. హైదరాబాద్‌లో ఫాస్టెస్ట్ డౌన్‌లోడ్ స్పీడ్ నమోదైంది. దేశంలో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ ఏటికేడు 11.6 శాతం పెరుగుతోందని ఊక్లా పేర్కొంది.


ఊక్లా నివేదిక ప్రకారం.. మూడో త్రైమాసికంలో వీఐ సగటు డౌన్‌లోడ్ వేగం 13.58 ఎంబీపీఎస్ కాగా, అప్‌లోడ్ వేగం 6.19 ఎంబీపీఎస్‌గా నమోదైంది. ఎయిర్‌టెల్ సగటు డౌన్‌లోడ్ వేగం 13.58 ఎంబీపీఎస్, అప్‌లోడ్ వేగం 4.15 ఎంబీపీఎస్‌గా ఉండగా, జియో మూడో స్థానంలో నిలిచింది. డౌన్‌లోడ్‌లో 9.71 ఎంబీపీఎస్, అప్‌లోడ్‌లో 3.41 ఎంబీఎస్‌కు పరిమితమైంది. అదే సమయంలో 4జీ నెట్‌వర్క్ అందుబాటులో జియో 99.7 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ (98.7 శాతం), వీఐ (91.1 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

Updated Date - 2020-10-30T03:05:16+05:30 IST